Pages

7 February 2013

సమైఖ్యత Vsఅనైక్యత




1
పెటేల్మని పాంజియా పగలకపోతే,
ఖండాలకి రూపుండేదా ?
ఈ జగతికి కళ వుండేదా ?
సమైఖ్యతని ఏడ్చేవారో,
అనైఖ్యతని అరిచేవారో,
ఎవరూ లేని ఆది కాలమది,.

2
రోడ్డెమ్మట నడిచేవానికి,
ప్రతిక్షణానికి దిక్కుమారదు,
నడిసంద్రంలో ఈదేవానికి,
భూభాగాలా జాడే దొరకదు,.

ఓపికలేక అద్ధం పగిలితే,
ఎవడి ముక్కలో వాడి ముఖాలే,
ఎన్ని వదిలినా,.కొన్ని కలిపినా
కష్టం – కనుమరుగై పోదు,.
రాజ్యం - రమణీయం కాదు,.

3
సగం రాష్ట్రాన్నే దేశంగా రూపొందించేసామే,.
కూలిన గోడల దేశన్నొకటి మొన్ననే చూశామే,.

ఎంత పట్టినా పాకిస్తాను పొరుగైపోలేదా,.
గాండ్రించిన రష్యా నేడు కుదేలు కాలేదా,.

అడగ్గానే తెల్లోడు స్వాతంత్ర్యం ఇచ్చాడా,.
నల్లోడొకడు గద్దెనెక్కితే దేశం సుభిక్షమయ్యిందా,.

బూతులతోటి భూభాగాలు బద్దలు అవుతాయా,.
గతకాలపు రాజ్యపు హద్దులు ఇంకా మిగిలే వున్నాయా,.

విడిపోతే స్వర్గం రాదు – కలిసున్నా సౌఖ్యం లేదు,

4
ఏ స్వార్థంతో లూరేషియా ముక్కలైపోయిందో,
ఏ తంత్రంతో హిమాలయాలు పైపైకీ ఎగసాయో,.

ఎత్తులు, పై ఎత్తులలో
అరువుబతుకులా ఆకలుండదు,
ఆకలే లేని రోజున,
అమరణ దీక్షకు విలువ వుండదు.

గందరగోళపు వ్యాఖ్యానాలు,
ఉత్తకూతలా ప్రేలాపనలు,.
జగడం ప్రాణసంకటం,. నిబద్దతే ప్రశ్నార్థకం,.

5
జీడిపాకమై సాగే కథలో,
చివరి మలుపులో ఏముందో,.
రెండు పిల్లులా కలహపు కధలో
లబ్ధిపొందినా కోతేదో,.

విడిపోయే రోజొకటొస్తే,
ఆనందంగా విడిపోదాం \ విద్వేషంతో కొట్టుకుచద్దాం
కలిసుండటమే తప్పనిసరైతే
అన్నదమ్ములుగా జీవిద్దాం \ రాష్ట్రం రావణకాష్టం.

రాజ్యలక్ష్మికి మనసు వుండదు,
కష్టజీవికి రాజ్యముండదు,.
కరుకు గుండెలో కవితలుండవు,.
కవులకలాలకు కుట్రతెలియదు,..,.
 --------------------------------------------------------



పాంజియా - 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఖండాలు కలసివుండేవి, దాన్ని పాంజియా

అంటారు,.మొదట పాంజియా రెండు ముక్కలయ్యింది, అవి గోడ్వానాలాండ్, లూరేషియా ,

..50 లక్ష్లల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో భాగంగా వున్న ఇండియా ఆసియా ప్రాంతాన్ని 

డీ కొట్లడం వలన హిమలయాలు ఏర్పడాయి ( కాంటినంటల్ డ్రిఫ్ట్ సిద్దాంతం ప్రకారం)

7 comments:

  1. intha adbhuthamina kavithan nannu okkasarigaa aschryaniki gurichesindhi.meerilane prayatnichandee challa chaala baaga rasaru.meeru raasina attyuthama kavitha idhi ani naa abhiprayaam.meeku jnanam patla vijnanam patla askhthi ekkuvay kabatti khaleel zibran rasina ee chinna katha mee kavitha lantidhe chadavandi.maro saree adbhutam gaa rasaaru.


    http://www.arab2.com/gibran/forerunner/17.htm

    ReplyDelete
  2. mee kavithalo unna nigudhamina thathvikatha adbutham

    ReplyDelete
    Replies
    1. ఈ కవితను ఇంతగా అభినందించినందుకు ధన్యవాదాలు తనోజ్,మీ ఒక్కరికైనా నచ్చడం నాకు చాలా ఆనందంగా వుంది,.నాకు నచ్చిన కవితలలో ఇది ఒకటి,.కవితను ఆస్వాదించేవాడే అసలైన కవి, రెండవసారి వచ్చి చదవి, కామెంట్ చేయడం మీ సహృదయత,.ప్రయత్నిస్తాను మంచి కవితలు రాయడానికి,నా పరిధి మేరకు,....

      Delete
  3. మీ కవిత చాలా శక్తివంతంగా ఉందండి.చదివికొద్దీ మళ్ళీ చదవాలని అనిపిస్తోంది.హాట్స్ఆఫ్ టు యూ

    ReplyDelete
    Replies
    1. ...ఇంత అభిమానంగా అభినందించిన మీకు,. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు,.,కవితను మెచ్చుకోవడం,మీ మంచితనం,.

      Delete
  4. Kapila Ramkumar.... చక్కటి కవిత......... రాజ్యలక్ష్మికి మనసు వుండదు, కష్టజీవికి రాజ్యముండదు,. కరుకు గుండెలో కవితలుండవు,. కవులకలాలకు కుట్ర తెలియదు.,.......జయహో!

    Indira Bhyri... ఫెటేల్మని పాంజియా పగలకపోతే...ఎత్తుగడలోనే విస్ఫోటనం!సూటిగా సరళంగా సాగినశైలికి హాట్సాఫ్

    Kavi Yakoob.. రోడ్డెమ్మట నడిచేవానికి,
    ప్రతిక్షణానికి దిక్కుమారదు,
    నడిసంద్రంలో ఈదేవానికి,
    భూభాగాలా జాడే దొరకదు,. //విలువైన కవిత. కవిగొంతుతో పలికిన కవిత. నిర్దిష్టత ఈ కవితాభాష. Narration భిన్నమూ,ప్రత్యేకంగానూ ఉంది.

    Sistla Madhavi.. chaalaa baagundi mee kavita.

    ReplyDelete