Pages

4 October 2013

కన్ఫ్యూసన్ వాదం



1
ఇలానే మిగిలిపోదాం,..
ఎవరికెవరం ఏమీ కాకుండా,
ఇంకెప్పటికి ఇంకిపోని గుండెలను,.
మళ్లీమళ్లీ మననం చేసుకుంటూ,
మనం ఇలానే మిగిలిపోదాం,.

2
సరే, నువ్వుంటావు నన్ను,ఫలాన ప్రాంతంవాడవని,.
దోపిడిదారుడినని,. రాంబందువునని,
ఇంకా,ఇంకా నోటికొచ్చిన తిట్లన్ని తిట్టినాఁక,.
ఇప్పుడంటావు,. బంగారు ప్రతిమలను ప్రతిష్టించుకున్నాఁక,.
కాలితో తన్ని,. విసిరికొట్టి,.దూరంగా నెట్టిన్నాఁక,.
మనం మనం ఒకటే,. కలిసుందాం ఇక అని,.
అసలింతకీ నేనెవడినో,. నువ్వెవడివో,. ఈ జాతరలో,.

3
దుఃఖించాడానికి,. కాస్తా దుఃఖాన్ని ఎప్పటికి మిగుల్చుకోవాలి,.
ఊపిరై మిగిలిన, ఊళ్లను వదులుకోవడానికి,.
నాది అనుకున్న ప్రాంతానికి నీళ్లోదలడానికి,.

ఆత్మీయతలను అణుచుకున్నాక,.
విజయాపజయాలు బావుటైలై ఎగురుతున్నాక
సవాలక్ష వాదనలు,.సమర్థవంతంగా
వినిపించడానికి,. చెవులున్నాయ్.,.
వాగడానికి ,.. నోర్లూ ఉన్నాయ్,.

 4
దొంగలెవరో,, దొరలెవ్వరో,..
ముసుగులిప్పేదాకా, తేల్చుకోలేం,.
ఇంకా తరువాత,. ఎన్ని తేల్చుకున్నా
పైకి మాత్రం ఎప్పటికి తేలలేం,.
ఎప్పుడూ,. వుంటుంటాడు,
ఒక దోపిడీదారో, ఆక్రమణదారో,.
అత్యాచార్ కమీనే గాడో,. వాడికి చెంచాగాడో,.
సరే,సరే,. వాడు మనోడైతే చాలునుకుందాం,..

5
నవ్వులు నింపుకున్న కళ్లల్లో ,.
పరిహాసాల్ని జోడించకు,..
కన్నీళ్లు తుడుచుకుంటూ,.
ఆగ్రహాన్ని జ్వలించకు,..
 మనం మనం మనుషులుగానే వుంటాం,.
వుంటూనే వుంటాం,. వద్దనుకున్నా సరే,.

కాస్తంత స్వార్థాలతో,.ఆశలతో,.. ప్రేమలతో,.జాలితో,
చెమర్చిన కళ్లతోనో,.ఆనంద బాష్పలతోనో
పేదలుగానో, శ్రామికులుగానో,. పీడితులుగానో,,.
ఉద్వేగాలు ఉప్పొంగించుకుంటూ,.
మరణిస్తు జీవిస్తూ,..జీవిస్తూ మరణిస్తూ,.
జ్వలిస్తూ,.చలిస్తూ,..

6
గీతలు గీయబడాలి,. కొన్ని చెరపబడాలి,.
హక్కులు హరాయించబడాలి,
బతుకులు మొరాయించబడాలి,.
భయాలతోటి, , కోటి ఆశల కలల తోటి,.
రేపటికోసం,.. మరంతగా ఎదురుచూస్తూ,.
మళ్లీ మళ్లీ చీల్చబడటానికి,.
గుండెల్ని సిద్దంగా వుంచుకోవాలి,.,

7
జీవితాన్ని పక్కన పెట్టు,..
ఇక్కడెప్పుడూ, కొన్ని లెక్కలుంటాయ్,
లాభాల క్రింద సంతోషాలు,.
నష్టాల వెనుక విషాదాలు,.
నువ్వొద్దన్న, వెంటాడుతూనే వుంటాయ్,.
గెలుపోటముల గమకాల క్రింద,
నలిగి చచ్చే స్వరాలుంటాయ్,.
వింటుండు,. వీలైతే అప్పుడప్పుడు,,.

8
ఎప్పటికి , శాశ్వితంగా మనెల్నేవి కలిపుంచలేవ్,.
భాషలు,. దేశాలు, రాష్ట్రాలు,.బంధాలు,
కొన్ని రాతకోతలు,.ఇంకోన్ని కోతి రాతలు,.

నిరంతర విడిపోతలే,. నిర్వచిస్తుంటాయ్,.
ఎప్పటికి ఒక సమగ్ర జీవితాన్ని,.
పూర్తి స్థాయి ప్రయాణాన్ని.,

9
తరువాతి గమ్యాలకై, లక్ష్యం నిర్థేశించుకుంటూ,.
వెతుకులాటలో సామాన్యుడినై,.
మతిచెడి మమేకమై,. ఒక ముద్రతో
కన్ఫ్యూషన్ కామెంట్,. విత్ కాస్తా కన్నీరు,.



No comments:

Post a Comment