Pages

30 October 2013

జ్ఞాపకం


1
 ఆ ఒక్క పదం వుంది చూసావు,.
నిన్నెల ఆకట్టుకుంటుందో,.
నిన్నెల నిలబెడుతుందో,.
నిన్నెల చంపేస్తుందో,.
ఆ ఒక్క బక్క పదమే,.
బహుశా నువ్వెప్పుడు,.
దాన్ని గురించి ఆలోచించికూడా వుండవు..,
ఆలోచించినా,.నవ్వుకొనెవుంటావు,.
2
మాటల పట్ల ప్రత్యేక ప్రేమేం లేదు,.
కాని,.కొన్ని సార్లు ఎవరైన వుంటే,.
మాట్లాడాలనిపిస్తుంది,.
చాలా సార్లు,. తొందరగా తప్పించుకోవాలనిపిస్తుంది,.

మౌనంగా మిగలడంలోని సుఖాన్ని తలుచుకోవడం,.
మాటలేలేని జీవితం ఎలా వుంటుందో,.

నిజంగా,.చాలా కష్టమైన పని మాట్లాడం,.
3
ఒక్క భావము లేక,. ఒక్క స్పందన లేక,.
హృదయ శ్మశానన మొలిచే మాటలనో,.
అనాథలైన పదాలనో కూడగట్టుకుని,.
సంద్రంలాంటి,.జీవితాన్ని దాటల్సోచ్చినప్పుడు,.
ఖచ్చితంగా మునిగిచావాలనిపిస్తుంది,.

అంటిపెట్టుకున్న నీ నవ్వుకొటి,
పట్టుకున్నట్లున్నాను,. 

కొట్టుకెళ్లిపోతున్నాను,,.ఈ కనిపించని అలలమధ్య

27 October 2013

బేకారీలు



289

ద్వేషం అనివార్యమై,.
విషం కక్కేటప్పుడు,.కూడ
అది కళాత్మకమై ,.ఆకట్టుకోవాలి,.
కాటువేయడంలో కూడా,.
రమణీయత ఉట్టిపడాలి,.


1789
ఎంత చించినా ,. చీకిపోయిన అతుకుల బొంతని,.
సంకలో ఏసుకొని తిరగలేంకదా,.

అలాంటప్పుడు,.,
ఉత్తరోత్తర జిలోతుత్తర,.అను,..ఉచిత సలహ,.

వదులుకోవాలనుకునేటప్పుడు,
మళ్లి ఒకసారి పునరాలోచించాలి,.


101
అపర దుర్భర బొబ్బ భీతిభీషణా,. 
లోక ఉత్త సత్యాన్ని,.చెవులమూసుకు విను,.

స్వహస్తాన్ని ఎండగట్టి,,,.
పరచేతిని నాకి పెట్టేటోడు,

బహుశా,.ముందుచూపోడైవుంటాడు,.
విపక్షపు పల్లకీలలో ఊరేగడానికి,.

సాయం చేశాక,.మోయక తప్పుద్దా,..


1485
నాయనా,.ఉన్మత్త ఉలుకోత్తరా,..
ప్రేలిప్రేలి,..పేలకుండా మిగలడంలో ఏముంది,
కించిత్ నిశ్శబ్థంతో ,.
బుర్రలను బద్దలుకొట్టడంలో,.
అసలైన మజావుంది,.


1897
ఓయి దుర్భిక్షానందా,..
విను,.ఇంకో సోది మాట,.
సైజులుతెలియని,.చిరిగిన కండోములతో,.
కర్మ మిగిలి,,.కార్యాలు సిద్ధించవచ్చును కాని,.
అదే కర్మ కాలినప్పుడు,.కాటికెల్లాల్సిందే ,.


172
అకృత్యవికృతాక్షరవీరా,.
విశాఖపట్నం,.హైదరాబాదు ఎర్రగడ్డ,
ఎక్కడెక్కడవెతికేం ఉపయోగం నాయానా,.
సివియర్,సన్సేషనల్,.సూపర్, సీనయర్,.
మానసికవికలాంగులకోసం,.
ముఖపుస్తకం చూడరాదు,. 
నాలాంటి గుట్టలు,.కట్టలుకట్టలు.,


శనిపట్టిన శకలం,.ఏ నెబ్యులాదో,. 
గుద్దుకోబోయేముందటి,.చివరి అజ్ఞానం,.

---------------------------------------
పాద వ్యర్థాలు**
దుర్భిక్షానందా = దుర్భిక్ష పరిస్థితులలో ప్రజల బాధను చూసి ఆనందించువాడు,
ఉత్తరోత్తర జిలోతుత్తర=భవిష్యత్తునూహించి, తుత్తర వలన కలిగిన ఒకానొక జిల 
అపర దుర్భర బొబ్బ భీతిభీషణా= భయముచే దుర్భరంగా అరచువాడు
ఉన్మత్త ఉలుకోత్తరా= భయ, ఉన్మత్తత వలన ఉత్తరకుమారుడై ప్రగల్పాలాడేవాడు
వికృతాక్షరఅకృత్యవీర = వికృతమైన అక్షరాలతో అకృత్యాలు చేయువాడు,.

25 October 2013

వివేకం


1
నేనేమీ కానప్పుడు,.నీకు,
మరింత స్తబ్ధంగా కనిపిస్తాను,.

నువ్వు అంగీకరించలేనన్ని,.
అప్రధాన భావాలను మోసుకుంటూ,.

2
పిచ్చితననాకి,
పరాకాష్టననుకో,.

నీ గుప్పిట్లో గింజకాకపోతే,.
అదిక తాలుదే,.

3
తూకం తూచడం,
తెలిసుండాలి,.బరువులతో,.

అది కవిత్వమైన,
మానవ సంబంధమైన.


*చవిటివాచకం*

24 October 2013

విరోధబాస.,


1
అలా నడుచుకుంటూ,
వెన్నలతుంపర్ల మధ్య,
ఆలోచనా శిబిరాన్ని,.
ప్రతిష్టించుకుంటాను,.
దేన్ని మార్చుకోవాలో అర్థంకాక.,.

2
పొసగని జీవితంతో,.రాజీపడాలో
అసంబద్దమైన కాలగమనాన్ని,
అనుమానంగా అనుసరించాలో,.
ఆత్మను వంచించుకోవాలో,.

3
సోమరిననుకోను,
వికాసమెరుగని శిలననుకోను,.
లోపలి సత్యాల పేచిలతో,.
అబద్దంగా మిగలలేక,.నాలా ఉండలేక,.
బతుకొక,. విరోధబాస.,


23 October 2013

మళ్లీ మళ్లీ అదే,..


2
అంగం లేకుండగా పుట్టి ఆడదైందని,.
వేటాడబడి వంటరైందని,.
నిరసించబడ్తు, రసహీనమైందని,.
సౌందర్యమే,.ఆ రూపమని,.
----------------

కవిత్వమే కదా,. ఏదైన రాసుకుందాం,.
లోపల ఆలోచనల్లో మనమెలా వున్న,.

అలానే ఇంకొక్కటి,..ఇలా,..

3
చరిత్రను పునర్విమర్శ చేయడం,.
జన్యువులలో ఏర్పడ్డ,.వికృతని,.
పైపై చెత్తలను పట్టి పట్టి చూసి,.
సాకులు ,.సమాధానాలు వెతుక్కుంటు,.
ఏ మార్పు లేని కాలాన్ని,.సాగదీయడం,.

అసలు రాజకీయం,.ఏదో మనదగ్గరే వుంది,.

4
మానవ వికాసం లో ,.
మిగిలిపోయిన ఆ ఛాయలు,.
తచ్ఛాడుతూనే వున్నాయా,.

నయావికాసం, నవనాగరికతై,.
నీ దేహం ఇప్పుడు వ్యాపారకూడలైంది,.
,.ఆర్థిక వనరైంది,. హింసాత్మక దృశ్యమైంది,.
ఆత్మలే లేనివాడి అరాచకాలకు నిలయమైంది,.

1
ఆడపిల్లంటే మనిషి కాదిక్కడ,
పుట్టగానే పూడ్చేయబడ్డ,
హృదయాలు,. ఆ ముఖాలు,.
మరి ఇంకా,. ఆ ఒక్కటి తప్ప,.సమస్తమూ అనుకో,.

ఆడపిల్లంటే మనిషే కాదిక్కడ,.
ఆ ఒకే ఒక అవయవం తప్ప,.



21 October 2013

స్వేచ్ఛాగీతం



1

సోదరా! మనకిక్కడ స్వేచ్ఛుంది,.
ఏ ప్రకరణం ప్రకారమో,.తెలయదుకాని,
ఏ అధికరణంఏం చెబుతుందో కాని,
పట్టిపట్టి చదవకపోయినా,
రాజ్యాంగపు ప్రతి పుటను,....
చూస్తున్న ప్రపంచం,
చెబుతున్న దాన్ని బట్టి,.
బల్లగుద్ది మరీ చెప్పచ్చు, 
తమ్ముడూ,.మనకిక్కడ స్వేచ్ఛుంది,..


2


నడిరోడ్లో బండి అడ్డమెట్టి,
వరాహబృందపు చర్చలు సాగించవచ్చు,
అదేమని అడిగినోన్ని,
వెధవను చేయను వచ్చు,..
పగలబడి నవ్వుతూ,
సెల్లులో సొల్లాడుతు,
50 ప్రాణాలు ఫణంగా పెట్టి,

60 మైళ్ల వేగంతో బస్సును నడపనువచ్చు.

ప్రేమపేరుతో అమ్మాయిలను వంచించచ్చు,
కావాలనుకున్నప్పుడెప్పుడైనా,
యాసిడ్ పూజలు చేయనువచ్చు.
పాతవిలువల వలువలనిప్పి,
కొత్త సొబగులు అద్దనువచ్చు,.
సోదరా! మనకిక్కడ స్వేచ్ఛుంది,.


3

చీప్ లిక్కర్ తాగుతావో,
పురుగుల మందేస్తావో,
చిత్తుకాగితాలేరుతావో,
బొచ్చెత్తుకు అడుక్కుతింటావో,.
లంచాలు గుంజుతావో,
నాయకుల తొత్తవుతావో,
వేయిరూపాయలకే ఓటమ్ముకుంటావో,
కమీషన్లతో కోట్లు కూడబెడతావో,.
మెరుగైన సమాజమంటూ,
మెదళ్లుకు చెదలెక్కిస్తావో,.
నమ్మకంగా నమ్మించిముంచుతోవో,..
నిన్ను నువ్వు తగలెట్టుకుంటావో,.
ఏదైనా చేస్కో,.
తమ్ముడూ!,. నీకిక్కడ స్వేచ్ఛుంది,.


4


విషపు బీజాలు నాటుకుంటూ,
బలంగా బలహీనపడతావో,
బలహీనంగా బలపడతావో,..

562 రాజ్యాల భావోద్వేగాల సాక్షిగా,

చీల్చుకుంటావో,కలుపుకుంటావో,.
నానా చెత్తా రాస్తూ, 
కవిత్వమని భ్రమపడతావో,.

ఏమైనా చేస్కో,.ఏదైనా రాస్కో,.
సోదరా!,.నీకిక్కడ స్వేచ్ఛుంది,.మితిమీరిన స్వేచ్ఛుంది.

18 October 2013

విద్యార్థులకు జాతీయస్థాయి పెయింటింగ్ పోటీలు

“SAVE WATER - SECURE FUTURE” థీమ్ తో జాతీయ భూగర్భ

జల సంస్థ,దేశవ్యాప్తంగా పాఠశాలల లో చిత్రలేఖన(పెయింటింగ్) పోటీలు 


నిర్వహిస్తుంది,.చివరితేది 31 అక్టోబర్ 2013. పూర్తి వివరాలకు ఈ లింక్ లో 

చూడండి. http://www.jalam.co.in/


Year 2013 has been declared as "WATER CONVERSATION YEAR" by Government of India with the slogan -
Save Water  - Save Life
Central Ground Water Board, Ministry of Water Resources, Government of India is conducting "PAINTING COMPETITION" on Water Conservartion for 6th,7th & 8th Standard students at 3 levels:-
  • School Level
  • State Level
  • National Level
School level competition to be conducted at the respective schools by the school authorities on any date before 31 Oct 2013. State and National level competition will be conducted by CGWB at Hyderabad and New Delhi respectively.
All Schools (Private & Government) are invited to participated in the contest and spread awareness about the importance of CONSERVING WATER.
PARTICIPATING CERTIFICATES, EXCITING PRIZES & MUCH MORE !!!!
GREAT OPPORTUNITY TO CREATE AWARENESS ABOUT WATER CONSERVATION TO YOUNG GENERATION
Details of the Program are given below:-

School Level Competition

Central Ground Water Board (CGWB), Ministry of Water Resources (MoWR), Government of India (GOI) is conducting the 4th Nationwide painting competition on Water Conservation for Students of 6th, 7 th & 8 th Classes at School, State and National levels as a part of its vigorous campaign on Water Conservation to create wide spread awareness among Students, the Future pillars of the Nation.
The main aim of competition is to create widespread awareness among the young generation on the importance of Water and need for conservation.

Competition Guidelines (School Level)

  • The theme of  the Painting Competition is “SAVE WATER - SECURE FUTURE”
  • School Principals/Head masters are requested to organize School level Painting competition for 2 hour duration at their respective schools in any of the day between 15.09.2013 to 31.10.2013
  • Painting may be made preferably on A4 size paper. However there is no restriction on type/size of paper, paints, crayons, water colour, etc. The Drawing materials for the school level would have to be provided by the respective schools/students and no cost in this regard would be borne by the MoWR/CGWB.
  • The Principal/Head Master will select 3 best paintings from each school and the same along with the list of participants are to be sent to the following address on or before 31.10. 2013.
    The Regional Director, Central Ground Water Board (CGWB), Ministry of Water Resources, Southern Region, GSI Post, Bandlaguda,          Hyderabad – 500 068, Andhra Pradesh.
  • All paintings must contain the details at the back of the drawing sheet – Name of student, Class, Section, School Name & addresses and Telephone numbers, e-mails, Father/Mother names & telephone numbers and Signature of Principal.
  • Paintings not signed by the school Principal or sent directly by student/parent to the Nodal Officer of CGWB will not be accepted.
  • No. of Students Participated in the competition and their details may be sent in the following format along with the selected paintings

15 October 2013

బాధ భాష


1
 సమ్జైతలేదు,.ఎంత గిల్లూకున్న,.
గిట్టెందుకై పోనాదో బతుకు,.
గింత కూడా నాకు సమ్జైతలేదు,.

పరాకు మాటోకటి దొర్లిపోనాది,.
మన్నించు,.మాదొర! ,.మన్నించుకో ,.పెబువా!
2
మనసులోపలి బాధ రాతైత లేదు,
గుండెపగిలిన ఘోష గోలైత లేదు,.
ఏమి సేయాలన్న,.వీలైత లేదు,.

నోటి దురదా కొద్ది,. మాటజారింది,
బుర్ర భగభగ మండి గుండమైనాది,,.

పాపాలు,.దోషాలు ఊరకే పోతాయా,.
శాపాలుగా మారి,.కాల్చలేకుంటాయా,.

3
కళ్లు మూసకపోయి,.కొవ్వు పట్టాలేదు,.
వాదాలు,గీదాలు నెత్తికెక్కాలేదు,.
చూడచక్కని మొక్క నీది కాదంటానా,,.
చోటు ఇచ్చిన దాత నువ్వు కాదంటనా,.

ఆనాడు,. చరితలో ఏమి జరిగీనాదో
ఎవరికెవరు అంత మంత్రమేశారో,.
ఎన్ని తంత్రాలేసి,.ఒక్కటైనామో,..
 ఎవరి బుట్టలో ఎవరు,.బొక్క బొర్లడ్డారో,.

ఏ స్వర్గం ఊహించారో,.,ఏ కలలను మోహించారో,.

4
నాదినాదనుకొని,..
ఎరువులే వేసాము,.నీళ్లు పట్టేసాము,.
పాదులే  తొవ్వుతూ,.పాటలే పాడాము,.
కష్టాలు ఫలములై,.మొక్క ఎదిగొచ్చింది,
ఎందరికో చేయిచ్చి,.పైకి తెచ్చింది,
దయతోటి చోటిచ్చి తల్లిచెట్టైంది,.

చెట్టు చుట్టుతా కళ్లాపి చల్లాము,.
ముగ్గులే వేసాము,.పూజలే చేసాము,.
విరగపండిన చెట్టు,కలలు పండిస్తుంటే,.
హాయిగా నీడలో విశ్రమించాము,.

5
కాలాలు గడిచాయి,.స్వార్థాలు పెరిగాయి,.
మొత్తంగా చేజిక్కే సాకు దొరికేసింది,.
ఆరోపణా లొల్లి మళ్లి మొదలైనాది,.

పాది తొవ్వి,  మట్టి దొంగలించామంటివి,.
విశ్రమించి, నీడ దోచుకున్నామంటివి,.
కలలు కని,  చెట్టు ఆక్రమించామంటివి,.

 నా చెట్టే నాకంట నీరు పెట్టించింది,.
నాదన్న ఊరే,. నట్టేట ముంచింది,.

లౌక్యమనుకొని నేను, నవ్వుకోవాలో,.
త్యాగమనుకొని నేను.,.నిబ్బరించాలో,,.

6
ఆశపడి నీడలకు,.
మెతుకులకై వలసొచ్చి,.
చేసినా శ్రమకు, ఇంచ విలువలేక
ఊరుకూరూ పోయి,.దొంగలై పోతిమే,.

భావ ఉద్వేగాలు బుర్రకెక్కించేసి,
తల్లి తరువూనంతా,. దోపిడి చేసి,.
కడుపుకొట్టిన నువ్వు,...దొరవైపోతివి,.

సమ్జైత లేదు,.దొర,. సమ్జైత లేదు,.

నీ గుండెగొప్పలు,..గింతైన, సమ్జైత లేదు,.