Pages

27 March 2016

బేకారీలు 16-20

16
విస్తృతంగా విస్తరించేటప్పుడు
పల్చబడటం సహజమే.

దీపం దూరమయ్యే కొలది
కాంతి కనుమరుగైనట్టు.
280915

17
మనుషులు
మనుషుల్లా లేనప్పుడు,
జీవితం
జీవితంలా వుండలేదు.
కవిత్వం కవిత్వంలా కూడా.


18
మునకలేయాలని నీలో
ఆశగా వుందన్నాడతను.

మునకే తప్ప,
తేలేదేముండదిక్కడంటూ,
మనోహరంగా నవ్వింది, కవిత్వం.
021015

19

బిట్వీన్ ద లైన్స్
బతుకుడు గురించి
ఎంతైన కొట్లాడతం.
ఎన్ని అబద్దాలోనైన
ఆదరంగా ఒదిగిపోతాం.

నిలబడ్డ ఒక్క నిజానైనా,
నవ్వుతూ హత్తుకోలేమా.
సిద్దాంతం లేని స్వేచ్ఛ గురించి
కాసేపు సాదరంగా మాట్లాడుకోలేమా.
260915



20
ఆశలు మొసుకుంటూ వచ్చి
అశ్రువై మిగిలిపోయాక,

ఇక, ఈ రాత్రికి
వెక్కివెక్కి ఏడ్చి
ఒదిగి నిద్రించడానికి.
ఒక హృదయపు ఒడి వెతకాలి.
250915


No comments:

Post a Comment